Varun Tej : హ్యాపీ బర్త్‌డే ‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ‘ఎఫ్ 3’ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు.. అలాగే ‘గని’ మూవీ నుండి ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్..

Varun Tej
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. కెరీర్ స్టార్టింగ్ నుండి మెగా క్యాంప్‌లో ఉన్న కమర్షియల్ హీరోల్లా కాకుండా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాకి డిఫరెంట్ కథలు, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. నటుడిగా తనలోని వేరియేషన్ని ఆడియన్స్‌కి చూపిస్తున్నాడీ క్యూట్ హీరో. బుధవారం (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు.
Ghani : వరుణ్ తేజ్ ‘గని’ కోసం హాలీవుడ్ స్టంట్స్ డైరెక్టర్స్..
వరుణ్ తేజ్.. హీరోగానే కాదు.. నటుడిగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు వరుణ్. ప్రతి సినిమాలో తన లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ డిఫరెన్స్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 10 వ సినిమా ‘గని’ లో బాక్సర్‌గా తనలోని మరో యాక్షన్ యాంగిల్‌ని చూపించబోతున్నారు. అంతేకాదు ‘గని’ గా ఫ్రెష్ లుక్, ఇంప్రూవ్డ్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు.
Tamannaah : బాక్సింగ్ రింగ్‌లో మిల్కీ బ్యూటీ అందాలవిందు..
‘ముకుంద’ తో ఇంట్రడ్యూస్ అయిన వరుణ్.. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన ‘కంచె’ సినిమాలో తన ఏజ్‌కి మించిన ఎమోషనల్ క్యారెక్టర్లో మెచ్యూర్డ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాల్లో సెన్సిటివ్ లవర్‌గా చాలా ఎమోషన్స్‌ని చూపించి సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశాడు.
Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..
‘లోఫర్’ సినిమాలో అప్పటి వరకూ చేసిన క్యారెక్టర్లకి డిఫరెంట్‌గా కేర్ లెస్ యాటిట్యూడ్‌తో రఫ్ నెస్‌ను చూపించాడు. ‘లోఫర్’ లో రఫ్‌గా కనిపిస్తే ‘ఎఫ్ 2’ సినిమాలో మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ని ఫుల్‌గా చూపించారు వరుణ్. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో చాలా కొత్తగా కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇప్పటి వరకూ తనకున్న క్యూట్ లుక్ నుంచి కంప్లీట్ మాస్ జానర్‌కి మారిపోయాడు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లోనూ నటిస్తున్నాడు వరుణ్. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ‘ఎఫ్ 3’ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ‘గని’ మూవీ నుండి ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.