Harish Rao Thanneeru : తెలుగు ఇండియన్ ఐడల్ రన్నరప్‌కి మంత్రి హరీష్ రావు ట్వీట్..
ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కంపిటిషన్ లో రన్నరప్‌గా నిలిచిన లాస్యకు తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

Harish Rao Thanneeru tweet on Telugu Indian Idol 2 runner up lasya priya
Harish Rao – Telugu Indian Idol 2 : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కంపిటిషన్ షోకి మంచి ప్రజాధారణ వచ్చింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) ద్వారా రెండో సీజన్ కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక మార్చిలో మొదలైన ఈ సీజన్ 5 కంటెస్టెంట్స్ తో ఫైనల్ కి చేరుకుంది. ఈ ఫైనల్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు.
Narasimha Naidu : నరసింహనాయుడు రీ రిలీజ్.. ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసా?
కాగా ఈ సెకండ్ సీజన్ టైటిల్ ని ‘సౌజన్య’ సొంతం చేసుకోగా ఫస్ట్ రన్నరప్‌గా జయరాజ్, సెకండ్ రన్నరప్‌గా లాస్య నిలిచారు. ఇక సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్య గురించి తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. “ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
Balakrishna : NBK108 టైటిల్ అప్డేట్.. దర్శకుడు బాబీ అండ్ బోయపాటి మూవీ అప్డేట్స్ పై న్యూస్..
గతంలో ఈ షోకి లాస్య సెలెక్ట్ అయ్యినప్పుడు కూడా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక ఈ విజేతలకు అల్లు అర్జున్ ప్రైజ్ మనీ అందించాడు. టైటిల్ ని అందుకున్న సౌజన్యకి 10 లక్షలు, జయరాజ్ కి 3లక్షలు, లాస్యకు 2 లక్షల నగదు బహుమతి అందించాడు.
ఇండియన్ ఐడల్ తెలుగు -2023
సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు ?
భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్… pic.twitter.com/MgL1iOPV36— Harish Rao Thanneeru (@BRSHarish) June 5, 2023