HBD Ram Charan: వారసత్వమే కాదు.. సాటిలేని ట్యాలెంట్ గ్లోబల్ స్టార్ సొంతం

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా ‘చిరుత’తోనే అభిమానుల్లో సాలిడ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ వారసత్వమే కాకుండా, తనలో ట్యాలెంట్‌కు కొదువ లేదని ఈ సినిమాతోనే చరణ్ నిరూపించుకున్నాడు.

HBD Ram Charan: వారసత్వమే కాదు.. సాటిలేని ట్యాలెంట్ గ్లోబల్ స్టార్ సొంతం

HBD Ram Charan Birthday Special

Updated On : March 27, 2023 / 7:37 AM IST

HBD Ram Charan: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా ‘చిరుత’తోనే అభిమానుల్లో సాలిడ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ వారసత్వమే కాకుండా, తనలో ట్యాలెంట్‌కు కొదువ లేదని ఈ సినిమాతోనే చరణ్ నిరూపించుకున్నాడు. ఇక ఆ తరువాత చరణ్ ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని, తానేమీ కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే ముందుకెళ్లడం లేదని విమర్శకులకు తెలియజేశాడు.

RamCharan : ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్న రామ్ చరణ్

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే కేవలం వారసత్వమే కాదు, ట్యాలెంట్ కూడా ఉండాల్సిందే అని నిరూపించి అందరికీ సమాధానం ఇచ్చాడు చరణ్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న చరణ్, కేవలం నటనలోనే కాకుండా డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ తాను స్పెషల్ అని నిరూపించుకున్నాడు. అయితే, చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించలేడని చాలా మంది విమర్శలు చేశారు. వారందరికీ ‘రంగస్థలం’ సినిమాతో చెంప ఛెళ్లుమనేలా సమాధానం ఇచ్చాడు ఈ స్టార్ హీరో. సుకుమార్ మార్క్ టేకింగ్‌కు చరణ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

Ram Charan : ఆస్కార్ తరువాత రామ్‌చరణ్ బర్త్ డే.. గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అభిమానులు..

చిరు నటవారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన చరణ్, తనలోని మైనస్‌లను గుర్తించి.. వాటినే ఒక్కోటిగా తనకు ప్లస్‌గా మలుచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపును తెచ్చుకుని, తన ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటుకున్నాడు. ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాలో నటిస్తున్న చరణ్, తన నెక్ట్స్ మూవీని ‘ఉప్పెన’ బుచ్చిబాబుతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇలా చేసిన కొన్ని సినిమాలతోనే ఈస్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుని, సక్సెస్‌ను కేరాఫ్‌గా మార్చుకుని దూసుకెళ్తున్న రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.