Actor Arya : ఆర్య నిర్దోషి.. తేల్చిన చెన్నై పోలీసులు
తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి హీరో ఆర్యపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యకు భారీ ఊరట లభించింది.

Actor Arya
Actor Arya : తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి హీరో ఆర్యపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసుతో ఆర్యకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఇద్దరు వ్యక్తులు కావాలనే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించిందని తెలిపారు.
ఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకోని మోసం చేశాడని జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్యను మూడు గంటలపాటు విచారించారు. ఆర్య ఎటువంటి తప్పు చేయకపోవడంతో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
ఎటువంటి తడబాటు లేకుండా హుందాగా కనిపించాడు. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచారు. పోలీసులు కేసు పెట్టిన యువతి నుంచి చాటింగ్ చేసిన నెంబర్లను తీసుకున్నారు. వాటి ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేసి భారీ మొత్తంలో డబ్బు గుంజినట్లు గుర్తించారు.
ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు, యువతి దగ్గర లాగిన డబ్బును రికవరీ చేసేపనిలో పడ్డారు. విద్జా నుంచి డబ్బు లాగి విలాసాలకు ఖర్చుచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కేసుపై ఈ నెల 17 వాదనలు నడిచాయి. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు.