Hero Kartikeya: ‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కార్తికేయ కొత్త మూవీ.. ఆసక్తికరంగా ఉన్న టైటిల్!

యంగ్ హీరో కార్తికేయ తెలుగునాట 'RX100' సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. హీరోగా, విల్లన్ గా చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ఈరోజు హీరో కార్తికేయ పుట్టినరోజు కావడంతో.. తన కొత్త మూవీ అప్డేట్ ఇచ్చాడు. కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా...

Hero Kartikeya: ‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కార్తికేయ కొత్త మూవీ.. ఆసక్తికరంగా ఉన్న టైటిల్!

Hero Kartikeya Announced His New Movie

Updated On : September 21, 2022 / 12:56 PM IST

Hero Kartikeya: యంగ్ హీరో కార్తికేయ తెలుగునాట ‘RX100’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. హీరోగా, విల్లన్ గా చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. తెలుగులో “రాజా విక్రమార్క” సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా మొదలు పెట్టకపోవడం గమనార్హం. మధ్యలో “వలిమై” సినిమాతో పలకరించినా.. అది తమిళ్ మూవీ పైగా విల్లన్ పాత్రలో కనిపించాడు.

RRR For Oscars: “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”.. ఇంకా ఛాన్స్ ఉంది!

ఇక ఈరోజు హీరో కార్తికేయ పుట్టినరోజు కావడంతో.. తన కొత్త మూవీ అప్డేట్ ఇచ్చాడు. కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా ‘బెదురులంక 2012’ అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్టు చిత్ర బృందం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించింది. గోదావరి బ్యాక్‌డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రాబోతున్నట్టు తెలుస్తుంది.

కథకు అనుగుణంగా యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ‘లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్’ అండ్ ‘సి.యువరాజ్’ సమర్పణలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక అందమైన పాట రాశారట. “క్లాక్స్” అనే యువ దర్శకుడు ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు.