Ram Charan : ఓటు వేయడానికి మైసూర్ నుండి హైదరాబాద్‌కు రామ్ చరణ్

ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు.

Ram Charan : ఓటు వేయడానికి మైసూర్ నుండి హైదరాబాద్‌కు రామ్ చరణ్

Ram Charan

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ సినిమా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో భాగంగా మైసూర్‌లో ఉన్నారు. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు.

Pooja Hegde : బుట్టబొమ్మ కాదు మామ చిలకమ్మ.. పూజా చీర ఫోటోలు..

నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సామాన్యులు, సెలబ్రిటీలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రైవేట్ జెట్ విమానంలో భాగ్యనగరానికి బయలుదేరారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా ఓ స్టార్ షూటింగ్ నుండి స్వస్థలానికి చేరుకోవడం ఓటు హక్కు ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది.

Malla Reddy : బాలీవుడ్ మీద నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన మల్లారెడ్డి..

శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవలే రామ్ చరణ్ మైసూర్ వెళ్లారు. అంతకు ముందు కూడా షూటింగ్ బ్రేక్ తీసుకుని ఇటలీలో జరిగిన వరుణ్, లావణ్యల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మరోసారి బ్రేక్ తీసుకుని ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కార్తీక్ సుబ్బరాజ్ రాసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోంది. కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.