Vijay Rashmika Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లి ముహూర్తం ఫిక్స్..!
జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చిన ఈ జంట.. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ.. ఎంగేజ్ మెంట్ రింగ్ లు మార్చేసుకున్నారు.

Vijay Rashmika Engagement: టాలీవుడ్ నటులు, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. రూమర్స్ కు తెర దించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో చాలా సీక్రెట్ గా నిశ్చితార్ధం జరిగింది. దసర పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ వేడుక జరిగింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.
గీత గోవిందంలో కలిసి నటించిన ఈ జంట హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మనసులు కూడా షేర్ కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాము జస్ట్ ఫ్రెండ్ అంటూ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. పలు వేడుకలకు కలిసి వెళ్లడం, ఒకరి సినిమాకు ఒకరు విషెస్ చెప్పుకోవడం చూశాం. ఇవన్నీ చూస్తే అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనిపించేది. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్ మెంట్ రింగ్ లు మార్చేసుకున్నారు.
వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సమాచారం మాత్రం ఇచ్చారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా, రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందారు. వీరిద్దరి లవ్ గురించి అనేకసార్లు మీడియా అడిగింది. కానీ, దీనిపై విజయ్ కానీ రష్మిక కానీ స్పందించింది లేదు. ఇప్పుడు సడెన్ గా వీరి ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. ఇక విజయ్, రష్మిక కాంబినేషన్ లో త్వరలో హ్యాట్రిక్ మూవీ రానుందని సమాచారం. మూడోసారి ఇద్దరూ కలిసి నటించనున్నారు. రీల్ లైఫ్ లో లవర్స్ గా యాక్ట్ చేసిన ఈ జంట ఇప్పుడిక రియల్ లైఫ్ లోనూ ఒక్కటవ్వబోతున్నారు. ఎంగేజ్ మెంట్ చేసుకున్న విజయ్, రష్మికకు సినీ ప్రముఖులు తమ విషెస్ తెలియజేస్తున్నారు.
Also Read: సింపుల్ గా పెళ్లి చేసుకున్న సింగర్.. తెలుగులో పాడింది ఒక్క పాటే.. కానీ చాలా ఫేమస్..