కంటెంట్ ఉంటే మేకప్‌తో పనిలేదు..

కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయికలు..

  • Published By: sekhar ,Published On : February 16, 2020 / 09:16 AM IST
కంటెంట్ ఉంటే మేకప్‌తో పనిలేదు..

Updated On : February 16, 2020 / 9:16 AM IST

కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయికలు..

అసలు ఏమాత్రం షాట్ గ్యాప్ వచ్చినా ట..చ…ప్.. అని మేకప్ వాళ్లని పిలిచే హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఫేజ్ నుంచి బయటికొచ్చి.. డీ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా ఈ ఎక్స్‌పెరిమెంట్లకు రెడీ అవుతున్నారు.

సువర్ణగా ఆకట్టుకున్న ఐశ్వర్య
క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో ఒక కథానాయికగా ఐశ్వర్యా రాజేష్ నటించింది. ఈ సినిమాలో ఐశ్వర్య.. ఇప్పటి వరకూ తను చేసిన గ్లామర్ రోల్స్‌కి కాంట్రాస్ట్‌గా డీ గ్లామర్ రోల్ చేసింది. బొగ్గు గనిలో పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి భార్య పాత్రలో పల్లెటూరి అమ్మాయి సువర్ణగా నటించింది. ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

బంజారా యువతిగా కీర్తి సురేష్
‘మహానటి’ తో జాతీయ అవార్డ్ గెలుచుకున్న కీర్తి సురేష్.. బంజారా యువతిగా డీ గ్లామర్ రోల్ చేస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. చేతికి తాయెత్తు, చెరిగిపోయిన జుట్టుతో చాలా న్యాచురల్‌గా కనిపించబోతోంది ఈ సినిమాలో. ఒక పక్క ‘మిస్ ఇండియా’ లాంటి ఫుల్ గ్లామర్ రోల్ చేస్తూనే గుడ్ లక్ సఖిలో డీ గ్లామర్ రోల్  చేస్తోంది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది కీర్తి..

 

‘రంగస్థలం’ లో రామలక్ష్మీగా ఆకట్టుకున్న సమంత
ఇంతకుముందు స్టార్ హీరోయిన్ సమంత కూడా డీ గ్లామర్ రోల్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్‌‌తో నటించిన ‘రంగస్థలం’ సినిమాలో మధ్య పాపిడి, రిబ్బన్‌తో జడవేసుకుని లంగా ఓణీతో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో రంగమ్మత్తగా సందడి చేసిన పాపులర్ యాంకర్ అనసూయ కూడా ప్రాతపరంగా డీ గ్లామర్‌గానే కనిపించింది.

తమన్నా, నయనతారలు కూడా

మిల్కీబ్యూటీ తమన్నా ‘కళాశాల’ అనే తమిళ్ డబ్బింగ్ మూవీలో, లేడి సూపర్ స్టార్ నయనతార ‘ఐరా’ లో, ‘అపరిచితుడు’ లో లైలా, సంగీత తదితరులు డీ గ్లామర్ రోల్స్‌లో మెరిశారు.  ఇలా హీరోయిన్లు కేవలం గ్లామర్‌గా కనిపించడానికే కాకుండా తమలోని నటనని ఎలివేట్ చెయ్యడానికి అప్పుడప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. 
 

Read More>> త్రివిక్రమ్ అతిథిగా.. నితిన్ హిట్ కొడతాడా..