Telugu Senior Hero’s: సీనియర్ హీరోలకి హీరోయిన్ల ఇక్కట్లు!
ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కానీ సరైన హీరోయిన్ ను ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు సీనియర్ హీరోలు. అన్నీ బాగున్నా అందాల భామ దగ్గరికొచ్చేసరికి హోల్డ్ లో పడుతోంది.

Telugu Senior Hero's
Telugu Senior Hero’s: ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కానీ సరైన హీరోయిన్ ను ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు సీనియర్ హీరోలు. అన్నీ బాగున్నా అందాల భామ దగ్గరికొచ్చేసరికి హోల్డ్ లో పడుతోంది. ఈ ప్రాబ్లమ్ ను డీకోడ్ చేసి ఇదిగో మా హీరోయిన్ మాక్సిమమ్ ఫిక్సయినట్టే అంటున్నారు చిరూ, నాగ్, బాలయ్య.
Maharaju Song: రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఇదో రకం సంతాపం!
చెల్లెలుగా కీర్తిని అయితే ఫిక్స్ చేసుకున్నారు కానీ చిరూ సినిమా స్టార్ట్ అయిందంటే హీరోయిన్ ఎవరన్న దానిపై ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల్లో హీరోయిన్ గా నయనతార పేరు ఫస్ట్ వినిపించింది. కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ లో చిరూ రోల్ కి హీరోయిన్ లేదని.. భోళాశంకర్ లో తమన్నా మాక్సిమమ్ ఫిక్సయినట్టేనని తెలుస్తోంది. ఆల్రెడీ తమన్నా మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది చిరంజీవికి. సైరా సినిమాలో కలిసి స్టెప్పులేయలేకపోయిన మిల్కిబ్యూటీని భోళాశంకర్ కు చిరూ రికమెండ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
Manchi Rojulu Vachayi: ట్రైలర్ టాక్.. బోలెడంత ఫన్ నింపేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్!
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తో అఖండను పూర్తి చేసిన బాలకృష్ణ నెక్ట్స్ శృతీహాసన్ తో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. బాలకృష్ణ తెరకెక్కించబోయే సినిమా కోసం ఫస్ట్ నుంచి శృతీపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు గోపీచంద్ మలినేని. ముందు వద్దనుకున్నా చివరికి శృతీహాసన్.. ఈ కాంబోకి ఓకె చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.
Rowdy Boys: లిప్‌లాక్.. ఘాటు రొమాన్స్.. రూటు మార్చిన అనుపమ?
నాగ్ ది సేమ్ పరిస్థితి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఘోస్ట్ మూవీ చేస్తున్నారు. హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారు. ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఇరకాటంలో పడ్డారు నాగ్. అయితే అమలాపాల్ ను ఘోస్ట్ కోసం ఫిక్స్ చేసారని టాక్. ఈ సినిమాలో నాగ్ తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసేందుకు కూడా అమలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు.