సోనియాని టార్గెట్ చేసిన కంగనా

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2020 / 05:22 PM IST
సోనియాని టార్గెట్ చేసిన కంగనా

Updated On : September 11, 2020 / 5:39 PM IST

శివసేన పార్టీ, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారుకు పాక్షికంగా కూల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. తన ఇంటి కూల్చివేత ఘటనపై…తాజాగా మ‌హరాష్ట్ర‌ సంకీర్ణ ప్ర‌భుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్‌ ను కంగనా టార్గెట్ చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశిస్తూ రుస ట్వీట్లు చేసింది. మ‌హారాష్ట్ర‌లో మీ ప్ర‌భుత్వం నా ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సాటి మ‌హిళ‌గా మీకు బాధ అనిపించ‌డం లేదా అని సోనియాని కంగనా ప్ర‌శ్నించింది.




ప్రియమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీగారు.. ఓ మహిళగా ఉండి మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులను చూసి మీ మనసు చలించడం లేదా ? రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కరర్ గారు రాసిన రాజ్యాంగ సూత్రాలను పాటించాలని మీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం లేదు? మీరు విదేశాల్లో పెరిగినా… భారత్‌లో నివసిస్తున్నారు. మహిళ చేస్తున్న పోరాటం గుర్తించరా? మీ సొంత ప్రభుత్వమే మహిళలను వేధిస్తూ, శాంతిభద్రతలను పూర్తిగా అపహాస్యం చేస్తున్న ఈ సమయంలో మీ మౌనం, ఉదాసీనతను చరిత్ర నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కంగనా ట్వీట్ చేసింది.
https://10tv.in/kangana-ranaut-vs-shiv-sena-live-updates-mumbai-cops-provide-security-outside-ranauts-house/


ఇక శివసేన వ్యవస్థాపకులు బాల్ సాహెబ్ థాక్రే అంటే తనకెంతో ఇష్టమైన రాజకీయ నేత. బ్రతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అవలంభించిన ఆయన పార్టీ ఇపుడు అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందన్నారు. ఈ విషయం తెలిసి బాల్ థాక్రే ఆత్మ ఘోషిస్తూ ఉంటుందంటూ వ్యాఖ్యానించి.. ఓ వైపు శివసేనను … మరోవైపు కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా కంగనా విమర్శలు గుప్పిస్తోంది.