పబ్‌కెళ్లిన ప్రీతి ఏమైంది – థ్రిల్ కలిగిస్తున్న ‘హిట్’ ట్రైలర్

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘హిట్’ (ది ఫస్ట్ కేస్).. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 10:10 AM IST
పబ్‌కెళ్లిన ప్రీతి ఏమైంది – థ్రిల్ కలిగిస్తున్న ‘హిట్’ ట్రైలర్

Updated On : February 19, 2020 / 10:10 AM IST

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘హిట్’ (ది ఫస్ట్ కేస్).. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘హిట్’ (ది ఫస్ట్ కేస్).. రుహాని శర్మ (చి.ల.సౌ ఫేమ్) హీరోయిన్.. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌‌ చూస్తే క‌న‌బడ‌కుండా పోయిన‌ ప్రీతి అనే అమ్మాయి కోసం విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఇన్వెస్టిగేష‌న్ చేశాడ‌నేదే క‌థాంశం అని తెలుస్తుంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం, మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి.

ఫిబ్రవరి 28న ‘హిట్’ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రానుంది. భాను చందర్, బ్రహ్మాజీ, మురళీశర్మ, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్ : గ్యారీ, మ్యూజిక్ : వివేక్‌సాగర్‌, ఫైట్స్ : నభా, ఆర్ట్ : అవినాష్ కొల్లా.