Matthew Perry : అనుమానాస్పద స్థితిలో ఒకప్పటి ఫేమస్ హాలీవుడ్ నటుడు మృతి..

హాలీవుడ్(Hollywood) సీనియర్ నటుడు, ఒకప్పటి ఫేమస్ నటుడు మాథ్యూ పెర్రీ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Matthew Perry : అనుమానాస్పద స్థితిలో ఒకప్పటి ఫేమస్ హాలీవుడ్ నటుడు మృతి..

Hollywood Friends Series Famous Actor Matthew Perry Passed away in his Home

Updated On : October 29, 2023 / 9:49 AM IST

Matthew Perry : హాలీవుడ్(Hollywood) సీనియర్ నటుడు, ఒకప్పటి ఫేమస్ నటుడు మాథ్యూ పెర్రీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. హాలీవుడ్ లో అనేక సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు మాథ్యూ పెర్రీ. టెలివిజన్ సిరీస్ ‘ఫ్రెండ్స్'(Friends) లో చాండ్లర్ బింగ్ అనే పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు. దాదాపు పదేళ్ళపాటు ఈ సిరీస్ సాగింది. ఈ సిరీస్ ఇండియాలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఇండియన్ ప్రేక్షకులకు కూడా మాథ్యూ పెర్రీ దగ్గరయ్యారు.

గత కొన్నాళ్లుగా మాథ్యూ పెర్రీ సినిమాలకు, టెలివిజన్ కి దూరమయ్యారు. మధ్యలో ఓ సారి డ్రగ్స్ కి బానిసై బయటకి రావడానికి చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దే ఉంటున్నట్టు సమాచారం. నిన్న అక్టోబర్ 28న లాస్ ఏంజిల్స్(Los Angeles) లోని తన ఇంట్లో బాత్ టబ్ లో అనుమానాస్పదంగా మరణించి కనపడ్డారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే ఉంటున్నట్టు తెలుస్తుంది. మాథ్యూ పెర్రీకి తోడుగా ఓ అసిస్టెంట్ ని పెట్టుకున్నారు.

Also Read : Puneeth Rajkumar : పునీత్ మరణించి నేటికి రెండేళ్లు.. ఆయన జ్ఞాపకాలతో కుటుంబం, కన్నడ ఇండస్ట్రీ, అభిమానులు..

నిన్న సాయంత్రం మాథ్యూ పెర్రీ అసిస్టెంట్ బయటకి వెళ్లి వచ్చాక అతన్ని బాత్ టబ్ లో పడి ఉండటం చూసి ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు, అంబులెన్స్ వచ్చి అతన్ని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 54 ఏళ్ళ వయసులో నటుడు మాథ్యూ పెర్రీ మరణించడంతో పలువురు ప్రముఖులు, ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.