దేవి, దాసరి గారికి రిలేషన్ ఇదే!..

  • Published By: sekhar ,Published On : October 4, 2020 / 02:29 PM IST
దేవి, దాసరి గారికి రిలేషన్ ఇదే!..

Updated On : October 4, 2020 / 2:34 PM IST

Devi Nagavalli – Dasari Narayana Rao: దేవి నాగవల్లి.. టీవీ 9 న్యూస్ రీడర్‌గా, రిపోర్టర్‌గా పాపులర్ అయ్యారు. తాజాగా బిగ్‌‌బాస్ 4లో ఆమె పార్టిసిపేట్ చేశారు. కాగా మూడో వారంలోనే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. విన్నర్‌గా నిలిచి ప్రైజ్ మనీ సొంతం చేసుకోవాలనుకున్న దేవి కోరిక నెరవేరలేదు.

Devi Nagavalliఅయితే దేవి నాగవల్లి.. దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి రిలేటివ్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల దేవి తల్లి గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ..


దాసరి తమకు చుట్టమే అని, బంధువులంతా శుభకార్యాల్లో కలుస్తుంటామని, కానీ ఎక్కడా ఆయన పేరు వాడుకోలేదని చెప్పారు. దాసరి, దేవి తల్లి గారి అత్తగారి తమ్ముడు.. దేవి తండ్రి, దాసరికి మేనల్లుడవుతారు. అలా దేవి, దాసరి గారికి మనవరాలు అవుతారని ఆమె తల్లి చెప్పారు.


రాజమండ్రిలో పుట్టి బికామ్ చదువుకున్న దేవి.. గ్రాఫిక్స్ కోర్స్ చేసి టీవీ 9 ఛానెల్‌లో చేరారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని అమెరికా వెళ్లిన ఆమె.. అక్కడ 8 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకున్నారు. దేవికి 6 ఏళ్ల బాబు ఉన్నాడు.Devi Nagavalli