Fighter : ‘ఫైటర్’ ట్రైలర్ చూశారా.. మొత్తం గాల్లోనే యాక్షన్ సీన్స్.. దేశభక్తితో..

తాజాగా ఫైటర్ ట్రైలర్ ని విడుదల చేశారు.

Fighter : ‘ఫైటర్’ ట్రైలర్ చూశారా.. మొత్తం గాల్లోనే యాక్షన్ సీన్స్.. దేశభక్తితో..

Hrithik Roshan Deepika Padukone Fighter Trailer Released

Updated On : January 15, 2024 / 12:31 PM IST

Fighter Trailer : వార్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్(Siddharth Anand) ఇప్పుడు హృతిక్ రోషన్( Hrithik Roshan) తో ‘ఫైటర్’ సినిమాని తెరకెక్కించాడు. దీపికా పదుకోన్(Deepika Padukone), అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, టెర్రరిస్ట్, పాకిస్థాన్ లతో యుద్ధం, దేశభక్తి లాంటి అంశాలతో ఫైటర్ ని తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఫైటర్ ట్రైలర్ ని విడుదల చేశారు.

Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతొచ్చాయో తెలుసా?

ట్రైలర్ లోని విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్, దీపికా, అనిల్ కపూర్.. ఫైటర్ జెట్ పైలట్స్ గా కనిపించబోతున్నారు. యాక్షన్ ఇంటెన్స్ సీన్స్, పాకిస్థాన్ పై, టెర్రరిస్టులపై అటాక్ సీన్స్, సైనికుల విన్యాసాలు, దేశభక్తి ఎమోషన్ తో పాటు హృతిక్, దీపికా రొమాన్స్.. ఇలా అన్ని అంశాలని ట్రైలర్ లో చూపించి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. ఇక ఫైటర్ సినిమాని 2024 జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ కొడతాడని బాలీవుడ్ భావిస్తుంది.