హృతిక్ నుంచి కరీనా వరకు: బాలీవుడ్ సెలబ్రిటీల హోం జిమ్‌లను చూశారా?
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్‌నెస్‌పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ లాక్డౌన్ టైంలో బాలీవుడ్ సెలబ్రిటీల జిమ్ల్లోకి తొంగిచూద్దాం
అమితాబ్ బచ్చన్ :
బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ లాక్ డౌన్ సమయంలో వ్యాయామం చేస్తూ ఉన్న ఫోటో ని షేర్ చేశారు. ట్రెడ్మిల్స్, డంబెల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న ఒక సెల్ఫీని షేర్ చేస్తూ‘జిమ్ ని కొనసాగించండి, మీ శక్తిని పెంచుకోండి’అంటూ క్యాప్షన్‌తో పోస్టు చేశారు. బిగ్ బీ జిమ్, ఏ మోడ్రన్ జిమ్‌కు తీసిపోదు.
విక్కీ కౌషల్ :
ఈ లాక్ డౌన్ సమయంలో మనలో చాలామందికి విసుగుగా ఉంటుంది. విక్కీ మాత్రం తన ‘ఆమ్లెట్ ఫ్లిప్పింగ్ నైపుణ్యాలను ’ప్రదర్శిస్తున్నాడు. హౌస్‌ను క్లీన్ చేసుకొంటున్నాడు.అలాగని ఫిట్నెస్ను విడిచిపెట్టలేదు.
అనిల్ కపూర్ :
ట్రైనర్ లేడని కొంతమంది exercise చేయకుండా తప్పించుకుంటారు. అనిల్ కపూర్ మాత్రం జిమ్ చేస్తూన్న ఓ వీడియోని షేర్ చేశారు. నా ట్రైనర్ @marcyogimead నాతో ఉన్నప్పుడు నా వ్యాయామం నుండి తప్పించుకునే అవకాశం లేదు #QuarantineandWorkout’ అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఇంకో సంగతి… అనిల్ జిమ్‌ను చూస్తుంటే, ఆయన fitness secret తెలిసిపోతుంది.
హృతిక్ రోషన్ :
హృతిక్ రోషన్ కూడా లాక్డౌన్లో తన బొచ్చు కుక్క జేన్ తో కలిసి ఇంట్లో జిమ్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. ‘జేన్ తన నాన్నలాగే ఇంట్లో ఉండమని చెప్పాలనుకుంటున్నాడు ’అనే క్యాప్షన్ తో ఫోటోని పంచుకుంటాడు. మానాన్న సీనియర్ రోషన్ ఇప్పటికీ రోజుకు రెండు గంటలు జిమ్ చేస్తాడు అని హృతిక్ చెప్పాడు. అతని జిమ్‌ను చూస్తుంటే తెలుస్తుంది Hrithik Roshanను ఎందుకు Greek God of Bollywood అని పిలుస్తారో!
వరుణ్ ధావన్ :
వరుణ్ ధావన్ హోం జిమ్‌లో వర్క్‌అవుట్స్‌తో బిజీ. ఇన్‌స్టాగ్రామ్‌లో నైట్ టైంలో ఎక్సర్సైజ్ చేస్తూ…మ్యూజిక్ వింటూ కనిపిస్తాడు.
ప్రతీక్ బబ్బర్ :
Dhobi Ghat, Jaane Tu… Ya Jaane Na, Dum Maaro Dum , baaghi 2తో పాపులర్ అయిన ప్రతీక్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అభిమానుల కోసం రెగ్యులర్‌గా వీడియోలను షేర్ చేస్తుంటాడు. లాక్డౌన్ సమయంలో ట్రైనర్లాగా మారిపోయి వర్క్ఔట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు.
శిల్పా శెట్టి :
shilpa shetty గొప్ప fitness freak.ఫ్యామిలీని జిమ్‌కి తీసుకొస్తుంది. తన అభిమానులనూ ఫిట్‌గా ఉండమంటూ వీడియోలను షేర్ చేస్తోంది. శిల్పాజిమ్ను చూడండి.
టైగర్ ష్రాఫ్ :
టైగర్‌కు లేటెస్ట్ హోంజిమ్ ఉంది. పుట్‌బాల్ ఆడుతున్నాడు, ట్రెరస్పై వర్క్ చేస్తున్నాడు. వీడియోలను ట్యాగ్ చేసి, అందరు ఫిట్ నెస్ గా ఉండమని చెబుతున్నాడు. అతని జీమ్ మాత్రం అదరరహో.
కరీనా కపూర్ ఖాన్ :
కరీనా కపూర్ ఖాన్ సింపుల్ అండ్ స్వీట్. ఆమె పర్సనల్ జిమ్ కూడా అంతే..
హార్దిక్ పాండ్యా :
క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మనోడు ఫిట్నెస్ ఫ్రీక్. జిమ్ చూస్తే తెలియడంలేదూ!