Rising Star Award: బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డు

టీవీ సీరియళ్లు, సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించిన నటుడు సయ్యద్ సోహైల్.. బిగ్ బాస్‌‌లో ఎంట్రీతో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

Rising Star Award: బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డు

Rising Star Award, Rising Star Award, Bigg Boss Fame, Sohel

Updated On : June 21, 2021 / 1:42 PM IST

Bigg Boss Fame Sohel: టీవీ సీరియళ్లు, సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించిన నటుడు సయ్యద్ సోహైల్.. బిగ్ బాస్‌‌లో ఎంట్రీతో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అభిమానులను అలరించిన సోహైల్.. తనకు వచ్చిన రూ .25లక్షలలో, రూ .10 లక్షలు అనాథాశ్రమాలకు విరాళంగా ఇచ్చారు. తర్వాత కూడా వివిధ సామాజిక సేవా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

లేటెస్ట్‌గా “సోహి హెల్పింగ్ హ్యాండ్స్” స్థాపించి, కరోనా కష్ట సమయాల్లో నిరుపేదలకు అవసరమైన వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సమాజానికి సోహైల్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, ABC ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్ అవార్డును సోహైల్‌కు ఇచ్చి సత్కరించారు.

ఈ సందర్భంగా సొహైల్‌ మాట్లాడుతూ.. నేను స్థాపించిన “సోహి హెల్పింగ్ హ్యాండ్స్” ద్వారా తాను సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి ఇవ్వడం వల్ల ఎంతో మానసిక ఆనందం పొందుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షురాలు లయన్‌ లలితారావు, ఏబీసీ ఫౌండేషన్‌ అధ్యక్షులు లయన్‌ కె.వి.రమణారావు, అన్నమాచార్య ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షులు అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.