Arun Srikanth Mashettey : హిందీ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ మన హైదరాబాదీ యూట్యూబరే
హిందీ బిగ్ బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ టైటిల్ గెలుచుకోగా.. టాప్ 5లో నిలిచాడు హైదరాబాదీ అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి. యూట్యూబర్‌గా చాలా ఫేమస్ అయిన అరుణ్ శ్రీకాంత్ బ్యాగ్రౌండ్ ఏంటంటే?

Arun Srikanth Mashettey
Arun Srikanth Mashettey : హిందీ బిగ్ బాస్ 17లో టాప్ 5లో నిలచిన అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ యూట్యూబర్. అక్టోబర్ 15, 2023 లో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన అరుణ్ శ్రీకాంత్‌ను ‘ప్రిన్స్ ఆఫ్ చార్మినార్’ అని పిలుస్తారు. అతని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం.
Bigg Boss 17 Winner : ఒకప్పుడు జైల్లో.. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ విన్నర్
హిందీ బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి హైదరాబాదీ అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి. బిగ్ బాస్ 17 లో పాల్గొనడం ద్వారా అరుణ్ శ్రీకాంత్ హైదరాబాదీ భాష మరియు సంస్కృతిని నేషనల్ టెలివిజన్‌కి పరిచయం చేయడం పట్ల హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అరుణ్ శ్రీకాంత్ యూట్యూబర్‌గా ఎంతో ఫేమస్. ‘అచానక్ బయానక్’ అనే గేమింగ్‌లో ప్రసిద్ధి చెందిన అరుణ్ శ్రీకాంత్ రెగ్యులర్‌గా లైవ్ స్ట్రీమ్ గేమింగ్ సెషన్ నడుపుతుంటారు. యూట్యూబ్‌లో 310k సబ్‌స్క్రైబర్లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 700k ఫాలోవర్లను కలిగి ఉన్నారు అరుణ్ శ్రీకాంత్.
Mangalavaram : జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన ‘మంగళవారం’ .. నాలుగు అవార్డులతో..
సీజన్ మొదలైనప్పటి నుండి ఎంతో యాక్టివ్‌గా ఉన్న అరుణ్ శ్రీకాంత్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నారు. ఫినాలే వరకు చేరుకున్నా పెద్దగా సపోర్ట్ దొరకకపోవడంతో టాప్ 5 స్ధాని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తనను అంతవరకు తీసుకువచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు అరుణ్ శ్రీకాంత్. ఫిబ్రవరి 4 న హైదరాబాద్ వస్తున్న అరుణ్ శ్రీకాంత్‌కి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి ఓల్డ్ సిటీ వరకు ర్యాలీతో స్వాగతం చెప్పబోతున్నారు హైదరాబాదీలు.
View this post on Instagram
Results from youtube.comView this post on Instagram