మహేష్ నా బిడ్డలాంటివాడు.. అది సురేఖ కోరిక..
‘ఆచార్య’ సిినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..

‘ఆచార్య’ సిినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆచార్య’ సినిమా గురించి తాజా ఇంటర్వూలో చిరు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ లేదా మరెవరైనా ప్రముఖ హీరో నటించనున్నారని ముందు నుంచి వార్తలు వినపడుతున్నాయి. మెగాస్టార్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తెరపంచుకోవడం ఖాయమైపోయిందన్నారు. కట్ చేస్తే చెర్రీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
చిరుతో మహేష్ నటించనున్నాడనే వార్తపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను పొరపాటున ‘ఆచార్య’ టైటిల్ చెప్పేశా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా.. ఈ ప్రాజెక్టులోకి మహేశ్‌బాబు పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నేనంటే మహేశ్‌కి ప్రేమ, అభిమానం. అలాగే, అతనంటే నాకు చాలా ఇష్టం. మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం. తనూ నా బిడ్డలాంటివాడు.
ఈ చిత్రానికి సంబంధించి ఓ పాత్రకు ముందు నుంచీ రామ్‌చరణ్ అయితే బాగుంటుందనే భావన కొరటాల శివకు ఎక్కడో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. అందువల్ల, ఆ సినిమా పూర్తికాకుండా తను ఎంత వరకూ డేట్స్ ఇవ్వగలడనే మీమాంస ఉంది. ఒకవేళ రాజమౌళిగారు, కొరటాల శివగారు అండర్‌స్టాండింగ్‌కి వస్తే.. ‘ఆచార్య’లో చరణ్ ఉండొచ్చు. ఒకవేళ కుదరకపోతే.. ఏమో! నేను, చరణ్ కలిసి కంప్లీట్ సినిమా చేయాలన్నది సురేఖ కోరిక. తల్లి కోరిక నెరవేరుతుందేమో చూడాలి..’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.
Read Also : స్నేహితుడు రామ్ తాళ్లూరిపై పవన్ పొగడ్తల వర్షం..
ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందట. మెగా పవర్ స్టార్ ఈ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడని దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందని తెలుస్తోంది. చెర్రీ సరసన ఓ యువ కథానాయిక నటించనుందని, చిరు, చరణ్ ఓ పాటలో కలిసి కనిపించనున్నారని సమాచారం. చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుంది.