Allu Arjun-Trivikram: మాంత్రికుడితో ఐకాన్ స్టార్.. క్రేజీ కాంబోలో మరో సినిమా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గతంలో పనిచేసిన దర్శకులనే రిపీట్ చేస్తున్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు..

Allu Arjun Trivikram
Allu Arjun-Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గతంలో పనిచేసిన దర్శకులనే రిపీట్ చేస్తున్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ముచ్చటగా మూడవసారి పుష్ప చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లోనే పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కనుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!
ఇక, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఇప్పటికే హ్యాట్రిక్ సినిమాలు చేశాడు. జులాయితో మొదలైన ఈ కాంబినేషన్ సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలతో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ఈ హిట్ ఇచ్చాడు.
Naga Chaitanya-Samantha: చైతూ గుర్తులు చెరిపేస్తున్న సామ్.. ఫోటోలు డిలీట్!
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసిన నాగవంశీ త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని వెల్లడించాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా అని అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. అయితే.. దీనిపై దర్శక, నిర్మాతల నుండి కానీ అల్లు అర్జున్ నుండి కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
a suprise coming up very soon @haarikahassine pic.twitter.com/I8wECi7JEH
— Naga Vamsi (@vamsi84) October 28, 2021