Acharya: 3 నెలల్లో చిరు రాక అనుకుంటే 3 ఏళ్ళు పట్టిందా?!

అన్ని అడ్డంకులు దాటుకుని ఆచార్య వస్తున్నాడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురు చూసిన ఆడియన్స్ కి, అన్నీ సెట్ చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఆచార్య టీమ్. 3నెలల్లో కంప్లీట్..

Acharya: 3 నెలల్లో చిరు రాక అనుకుంటే 3 ఏళ్ళు పట్టిందా?!

Acharya

Updated On : October 12, 2021 / 11:00 AM IST

Acharya: అన్ని అడ్డంకులు దాటుకుని ఆచార్య వస్తున్నాడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురు చూసిన ఆడియన్స్ కి, అన్నీ సెట్ చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఆచార్య టీమ్. 3నెలల్లో కంప్లీట్ చేద్దామనుకున్న సినిమా మూడో సంవత్సరం వచ్చినా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ క్రిస్మస్ కైనా వస్తుందనుకున్న ఆడియన్స్ కి.. నెక్ట్స్ ఇయర్ సినిమా రిలీజ్ అని చావుకబురుచల్లగా చెప్పారు చిరంజీవి.

Prabhas 25: ప్రభాస్ హీరోయిన్‌పై క్యూరియాసిటీ.. ఛాన్స్ దక్కేది ఎవరికో?

సరిగ్గా రెండేళ్ల క్రితం అక్టోబర్ లో మొదలైన ఆచార్య సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ అవ్వలేదు. ఇదిగో అయిపోయింది.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తున్న ఆచార్య .. ఆఖరికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి ధియేటర్లు బ్లాక్ చెయ్యడంతో ఛేసేదేం లేక.. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4న రాబోతున్నాడు ఆచార్య.

Samantha: నెగటివ్ పబ్లిసిటీ ఎంత ఉన్నా.. మరింత స్ట్రాంగ్‌గా సామ్!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ కంబైన్డ్ గా తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. సినిమా కంప్లీట్ అయినా కూడా రిలీజ్ డేట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఆచార్య ఇన్నాళ్లకి ధియేటర్లోకొచ్చే డేట్ అనౌన్స్ చేసింది.

Varudu Kaavalenu: దిగుదిగు నాగ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్!

ఆచార్య సినిమాని 3 నెలల లోపే కంప్లీట్ చేద్దామని అనుకున్న కొరటాల ప్లాన్ మొత్తం కరోనాతో అట్టర్ ఫ్లాప్ అయ్యి 3 సంవత్సరాలు పట్టింది. మే నుంచి దసరాకు షిఫ్ట్ అయిన సినిమా.. ఆల్రెడీ దసరాతో పాటు దీపావళి కూడా ఫుల్ అయిపోవడంతో ఇయర్ ఎండ్ కి షిఫ్ట్ అవుదామనుకుంది. కానీ అప్పటికే ఇయర్ ఎండ్ లో సినిమాలతో పాటు జనవరి ఫస్ట్ వీక్ ఆర్ఆర్ఆర్ లాక్ అయిపోయింది. ఇక ఇప్పటికే టైట్ గా ఉన్న సంక్రాంతికి ఆచార్యని రిలీజ్ చేసి రిస్క్ పెంచడం ఎందుకని.. ఎవ్వరూ లేని టైమ్ లో ఫిబ్రవరి 4న సినిమా రిలీజ్ కు ముహూర్తం పెట్టారు ఆచార్య టీమ్.