Ileana D’Cruz : ఇలియానా ప్రెగ్నెన్సీ.. అతనే అంటూ మొదటిసారి ప్రియుడి గురించి పోస్ట్.. కానీ..

కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నాను, ప్రగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది ఇలియానా. అప్పట్నుంచి తన బేబీ బంప్ ఫొటోలు కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది.

Ileana D’Cruz : ఇలియానా ప్రెగ్నెన్సీ.. అతనే అంటూ మొదటిసారి ప్రియుడి గురించి పోస్ట్.. కానీ..

Ileana D'Cruz shares her boyfriend photo but in blur and shares emotional post

Updated On : June 10, 2023 / 4:25 PM IST

Ileana D’Cruz : ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఇలియానా అనంతరం బాలీవుడ్(Bollywood) కి చెక్కేసింది. మొదట్లో బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినా ఆ తర్వాత కష్టమైపోయాయి. ఇలియానా చివరిసారిగా 2021 లో ఓ బాలీవుడ్ సినిమాలో కనిపించింది. అప్పట్నుంచి ఇలియానా మళ్ళీ సినిమాలు చేయలేదు. ఇటీవలే ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది.

కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నాను, ప్రగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది ఇలియానా. అప్పట్నుంచి తన బేబీ బంప్ ఫొటోలు కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది. దీంతో చాలామంది.. పెళ్లి చేసుకోకుండా తల్లి ఏంటి?, తండ్రి ఎవరు?.. అంటూ ఇలియానా పై ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది.

తాజాగా ఇలియానా ఓ ఫోటో షేర్ చేసి ఆసక్తికర ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. అయితే ఆ ఫోటో మొత్తం బ్లర్ గా ఉంది. దీంతో ఆ ఫొటోలో ఇలియానాతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది కానీ అతను ఎవరో తెలియకపోవడంతో ఎవరు అని అంతా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇలియానా ఆ ఫోటోని షేర్ చేస్తూ.. తల్లికావడం అనేది ఒక మంచి అనుభూతి. ఇలాంటి అనుభూతిని నేను చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఒక జీవి నాలో ప్రాణం పోసుకుంటుంది అనే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. రోజు నా బేబీ బంప్ ని చూసుకుంటున్నాను. త్వరలో తనని కలవబోతున్నాను అని తనకు పుట్టబోయే బిడ్డ గురించి రాసింది. అలాగే.. కొన్ని కష్టమైన రోజులు చూశాను. నాకెంతో నిస్సహాయత రోజులను చూశాను. అలాంటి వాటి నుంచి బయటకు రావాలనుకున్నాను. కన్నీళ్లు కూడా కార్చాను. బాధపడ్డాను. అలాంటి సమయంలో నేను బాధపడకూడదు ధైర్యంగా ఉండాలనుకున్నాను అంటూ తన జీవితంలో కష్టాల గురించి రాసింది.

Thalaivar 170 : రజినీకాంత్‌తో అమితాబ్.. 32 ఏళ్ళ తర్వాత.. తలైవా 170వ సినిమాలో..

నేనెలాంటి తల్లిని అవుతానో నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు కానీ నా ప్రేమను ఈ చిన్ని పాపాయికి అందిస్తాను. ప్రస్తుతానికి నా ప్రేమను అంతా నీకు అందిస్తాను అంటూ తనకు పుట్టబోయే బిడ్డ గురించి తన పోస్ట్ లో రాసింది ఇలియానా. ఇక ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి రాస్తూ.. నా గురించి నేను మర్చిపోయిన రోజుల్లో ఈ వ్యక్తి నాకు అండగా నిలిచాడు. నా కన్నీళ్ళని తుడిచాడు, నన్ను నవ్వించాడు, నాకు ఆ సమయంలో ఏం కావాలో అర్ధం చేసుకొని అవన్నీ ఇచ్చాడు. ఇకపై నాకు ఏది కష్టంగా ఉండదు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. అయితే ఇంత పోస్ట్ చేసినా ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పలేదు. దీంతో మరోసారి నెటిజన్లు, అభిమానులు.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలియానా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి బిడ్డ పుట్టిన తర్వాత అయినా తండ్రిని పరిచయం చేస్తుందేమో చూడాలి.