Inaya Sulthana : ఇనయా సుల్తానా మెయిన్ లీడ్ లో రా & రస్టిక్ సినిమా ‘మదం’.. రిలీజ్ ఎప్పుడంటే..

ఇనయా సుల్తానా ఒక మెయిన్ లీడ్ గా మదం అనే రా & రస్టిక్ సినిమా రాబోతుంది.(Inaya Sulthana)

Inaya Sulthana : ఇనయా సుల్తానా మెయిన్ లీడ్ లో రా & రస్టిక్ సినిమా ‘మదం’.. రిలీజ్ ఎప్పుడంటే..

Inaya Sulthana

Updated On : December 26, 2025 / 12:51 PM IST

Inaya Sulthana : బిగ్ బాస్ తో, ఆర్జీవీ భామ అంటూ మంచి ఫేమ్ తెచ్చుకుంది ఇనయా సుల్తానా. ఇనయా ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇప్పుడు ఇనయా సుల్తానా ఒక మెయిన్ లీడ్ గా మదం అనే రా & రస్టిక్ సినిమా రాబోతుంది.(Inaya Sulthana)

ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సూర్యదేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మాణంలో వంశీ మల్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా విశ్వనాధ్, హేమ.. పలువురు నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Madham Movie

Also See : Allu Ayaan : బన్నీ తనయుడు అల్లు అయాన్ క్రిస్మస్ రీల్ చూశారా..? వీడియో వైరల్..

ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. హింసతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువే ఉన్నట్టు ట్రైలర్స్ చూస్తే తెలుస్తుంది.