Indraja : ‘సీఎం పెళ్ళాం’గా రాబోతున్న ఇంద్రజ.. హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా..?
సీఎం పెళ్ళాం అనే ఆసక్తికర టైటిల్ తో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఇంద్రజ సీఎం పెళ్ళాం మెయిన్ లీడ్ పాత్రను పోషిస్తుంది.

Indraja Acting in CM Pellam Movie Movie Releasing in Soon
Indraja – CM Pellam : త్వరలో సీఎం పెళ్ళాం అనే ఆసక్తికర టైటిల్ తో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఇంద్రజ సీఎం పెళ్ళాం మెయిన్ లీడ్ పాత్రను పోషిస్తుంది. జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో RK సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాణంలో గడ్డం వెంకట రమణరెడ్డి దర్శకత్వంలో ఈ సీఎం పెళ్ళాం సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సీఎం పెళ్ళాం సినిమా ప్రెస్ మెట్ నిర్వహించారు.
Also see : Meena Birthday Celebrations : స్నేహితులతో మీనా పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు వైరల్..
సీఎం పెళ్ళాం ప్రెస్ మీట్లో ఇంద్రజ మాట్లాడుతూ.. సుమన్ గారితో చాలా సినిమాలు చేశాను. అప్పుడు ఇప్పుడు ఆయన మంచి మనుసు ఒకేలా ఉంది. సీఎం పెళ్లాం సినిమాలో సీఎం భార్య పాత్రలో నటించాను. ఇదొక ప్రత్యేకమైన సినిమా, మంచి సందేశాన్ని ఇస్తుంది. సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది అని అన్నారు.
డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పెళ్ళాం రాజకీయ నేపథ్యంతో సాగే సందేశాత్మక సినిమా. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అని చూపించారు. మా సినిమాలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందో అని చూపించబోతున్నాం అని తెలిపారు. నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి మంచి స్క్రిప్ట్ వినిపించారు. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత కంటెంట్ కూడా సినిమాలో ఉంది అని తెలిపారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా పేరు తెచ్చుకోవాలి. ఇంద్రజ గతంలో నాతో హీరోయిన్ గా నటించింది. ఆమెతో మళ్లీ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు. నటుడు అజయ్ మాట్లాడుతూ.. సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అంటే సమాజానికి మంచి జరుగుతుంది అని సినిమాలో చూపిస్తారు. మా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు అని తెలిపారు.
నటుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను హోం మంత్రి పాత్రలో నటించాను అని తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మళ్ళీ నటుడిగా మరి ఇప్పుడు సీఎం పెళ్ళాం సినిమాలో హోమ్ మినిష్టర్ గా రాబోతుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.