Emmy Awards 2023 : ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియన్స్ హవా..

తాజాగా జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియాకు కూడా అవార్డులు వరించాయి.

Emmy Awards 2023 : ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియన్స్ హవా..

International Emmy Awards 2023 Winners from India

Updated On : November 21, 2023 / 11:56 AM IST

International Emmy Awards 2023 : అమెరికాలో(America) ఇచ్చే ప్రఖ్యాత అవార్డ్స్ ఎమ్మీ అవార్డ్స్. అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ టెలివిజన్ రంగంలోని షోలు, సిరీస్ లకు ఈ అవార్డ్స్ ఇస్తారు. ఓటీటీ వచ్చిన తర్వాత అందులో వచ్చే రెగ్యులర్ షోలు కూడా కలిపి ఈ అవార్డులని ఇస్తున్నారు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ కేటగిరిలో అనేక దేశాల నుంచి పాల్గొంటారు. 74 ఏళ్ళ క్రితమే ఎమ్మీ అవార్డ్స్ ప్రారంభించినా ఇంటర్నేషనల్ అవార్డ్స్ మాత్రం 50 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు.

తాజాగా జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియాకు కూడా అవార్డులు వరించాయి. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు ఫర్ కామెడీకి గాను నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న ఇండియన్ కామెడీ షో ‘వీర్ దాస్ ల్యాండింగ్'( Vir Das Landing) కి అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డు కోసం మరిన్ని షోలు పాల్గొనగా ఇంకో షో ‘డెరి గర్ల్స్’ కూడా టై అయి ‘వీర్ దాస్’తో అవార్డుని పంచుకుంది.

అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్(Ekta Kapoor) కి ప్రఖ్యాత ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డుని అందించారు. తన బాలాజీ టెలి ఫిలిమ్స్ సంస్థపై ఎన్నో టీవీ షోలు, సీరియల్స్, ఓటీటీ షోలు, సిరీస్ లు తెరకెక్కించి సక్సెస్ ఫుల్ గా సాగుతున్నందుకు ఏక్తాకు ఈ అవార్డుని అందించారు. వీర్ దాస్ గతంలో కూడా రెండు సార్లు ఇదే షో నుంచి నామినేట్ అయినా ఈ సారీ మాత్రం అవార్డు దక్కించుకున్నాడు.

Also Read : Pro Kabaddi : కబడ్డీ కోసం కలిసిన బాలయ్య, టైగర్ ష్రాఫ్, కిచ్చ సుదీప్.. వీడియో అదిరిపోయిందిగా..

వీర్ దాస్, ఏక్తా అవార్డులు అందుకున్నాక ఎమోషనల్ అయి మాట్లాడారు. తమ సోషల్ మీడియాలో అవార్డులతో ఫోటోలని పోస్ట్ చేశారు. వీర్ దాస్ ఈ అవార్డుని ఇండియాకు, ఇండియన్ కామెడీకి అంకితం చేస్తున్నాను అని ప్రకటించాడు. దీంతో దేశవ్యాప్తంగా ఇద్దరికీ అభినందనలు వస్తున్నాయి.