Naveen Chandra : మరోసారి పోలీస్ గా నవీన్ చంద్ర.. లెవన్ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ తో..
వరుసగా సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ తో పాటు పెద్ద సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర.

Interview of Naveen Chandra about Eleven
వరుసగా సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ తో పాటు పెద్ద సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా ‘లెవన్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కింది. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రియా హరి నిర్మాణంలో లోకేశ్ అజిల్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లెవన్ సినిమాని తమిళ్ – తెలుగులో నేడు మే 16న థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర తాజాగా మీడియాతో ముచ్చటించాడు.
నవీన్ చంద్ర ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు లెవన్ అనే టైటిల్ కథ నుంచి వచ్చింది. సినిమా చూసినప్పుడు ఆ టైటిల్ ఎందుకు పెట్టామో మీకే తెలుస్తుంది. ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్ లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో వుంది. ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో ప్రతిదానికి లాజిక్ వుంటుంది. ఇందులో ట్విస్ట్ లని ముందుగా డీకోడ్ చేయడం కష్టం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు రెస్పాన్స్ బాగా ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ దొరికింది అని తెలిపారు.
Hari Hara Veera Mallu : పవన్ ‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్..
స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఇది మంచి రైటింగ్ బలం ఉన్న సినిమా. తెలుగు తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు సినిమా ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఇది డైరెక్టర్, టెక్నికల్ ఫిల్మ్. లోకేష్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన వారంతా డైరెక్టర్, రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. సినిమాలో సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది అని చెప్పారు.
అలాగే.. ఈ సినిమాని రెండు భాషల్లో డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ తో తీశాం. స్క్రిప్ట్ ని కూడా ట్రాన్స్ లేట్ చేయలేదు. తెలుగు నుంచి ప్రత్యేకంగా రైటర్ తో రాయించాము. తెలుగు తమిళ్ బైలింగ్వల్ చేయడం ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ గానే భావిస్తున్నాను. ఈ సినిమాకి తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పాను. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకి ప్రతి భాషలో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.
War 2 teaser : ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2 టీజర్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్..
అలాగే నవీన్ చంద్ర తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. రవితేజ గారికి విలన్ గా మాస్ జాతర సినిమాలో చేస్తున్నాను. అందులో నా పాత్ర, సినిమా అదిరిపోతుంది. కరుణ్ కుమార్ తో హానీ అనే సినిమా చేస్తున్నాను. అది చాలా డార్క్ సినిమా అది. అలాగే కాళీ అనే ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాను. తమిళ్ లో ఓ సినిమా, ఇంకోటి కామెడీ సినిమా చేస్తున్నాను అని తెలిపాడు.