RRRలో ఐటెం సాంగ్ ఉందా మావా.. ఆర్ఆర్ఆర్ టీం ఫన్నీ రిప్లై!
టాలీవుడ్ లో సినిమాలెన్ని ఉన్నా ఆర్ఆర్ఆర్ ప్రత్యేకం. ఎందుకంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్..
RRR: టాలీవుడ్ లో సినిమాలెన్ని ఉన్నా ఆర్ఆర్ఆర్ ప్రత్యేకం. ఎందుకంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ నటించే సినిమా కావడంతోనే ఈ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే జక్కన్న ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చాడు. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Tollywood Crazy Films: క్రేజీ కాంబోలు.. ఎటు చూసినా ప్రమోషన్ల రచ్చే!
ఆర్ఆర్ఆర్ నుండి ఏ అప్డేట్ వచ్చినా అది బంపర్ హిట్టే. ఆ మాటకొస్తే ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ మాత్రమే కాదు.. దీనిపై చేసే మీమ్స్, నాటు పాటకి చేసిన రీ ఎడిట్స్, ఈ సినిమా గురించే అప్డేట్స్ ఇచ్చే యూట్యూబ్ వీడియోలు ఇలా ఏదైనా సోషల్ మీడియాలో సూపర్ డూపర్ హిట్టే. రోజూ ఏదో ఒక అంశం గురించి ఆర్ఆర్ఆర్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ రన్ అవుతూనే ఉంటుంది. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఫన్నీ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!
బాహుబలి మాదిరి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా లేదా అని చాలా మంది డైలమాలో ఉన్నారు. ఓ నెటిజన్ ఇది ఆపుకోలేక ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేసి ‘సినిమాలో ఐటం సాంగ్ ఉందా మావా’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మూవీ టీం..’ఏ నువ్వు చేస్తావా’ అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
Ye Nuvvu Chesthaaavaa… pic.twitter.com/d2xoLHParR
— RRR Movie (@RRRMovie) November 26, 2021