Liger Movie : లైగర్‌లో మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?

ఇక లైగర్ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తుండటంతో మరి విజయ్ కి, మైక్ టైసన్ కి ఫైట్ ఉంటుందా అని............

Liger Movie : లైగర్‌లో మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?

mike tyson vijay devarakonda

Updated On : August 24, 2022 / 7:22 AM IST

Liger Movie :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇండియా అంతా తిరిగేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని చెప్తున్నారు.

ఇక లైగర్ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తుండటంతో మరి విజయ్ కి, మైక్ టైసన్ కి ఫైట్ ఉంటుందా అని అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఫైట్ ఉంటే ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై పూరి జగన్నాధ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

Liger Movie : లైగర్ సినిమా ఫ్లాప్ అయితే.. విలేఖరి ప్రశ్నకి విజయ్ దేవరకొండ ఏమని చెప్పాడో తెలుసా?

పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ”విజయ్‌, మైక్‌ టైసన్‌ మధ్య ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంది. కానీ అది బాక్సింగ్ రింగ్ లో కాదు. బయట ఉంటుంది. బాక్సింగ్ రింగ్ లో వేరే నటులు ఉన్నారు” అని తెలిపారు. దీంతో ఎక్కడైతే ఏముంది మైక్ టైసన్ తో విజయ్ ఫైట్ ఉంది అని తెలియడంతో రౌడీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక టైసన్‌తో తలపడాలంటే శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అందుకే ఈ సినిమా కోసం సుమారు రెండేళ్లు విజయ్ దేవరకొండ ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని బాగా కష్టపడ్డాడు అని పూరి తెలిపాడు.