ISKCON : భగవద్గీత గొప్పదనాన్ని చెప్పడానికి సినిమా తీస్తున్న ‘ఇస్కాన్’.. తెలుగు డైరెక్టర్‌తో..
ఇస్కాన్ సంస్థ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న వారికి తెలియాలని ఓ సినిమాని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కిస్తున్నారు.

ISKCON Planning a Movie for Promote Bhagavad Gita with Telugu Director Santhosh Jagarlapudi
ISKCON : శ్రీకృష్ణుడి తత్త్వం భోదిస్తూ ఇస్కాన్ సంస్థ ప్రపంచంలో ఎన్నో చోట్ల కృష్ణుడి ఆలయాలు స్థాపించి సనాతన ధర్మాన్ని, శ్రీకృష్ణుడి చెప్పిన భగవద్గీతని(Bhagavad Gita) వ్యాప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న వారికి తెలియాలని ఓ సినిమాని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కిస్తున్నారు.
తెలుగు దర్శకుడు సంతోష్ జాగర్లపూడికి ఈ షార్ట్ ఫిలిం తీసే బాధ్యతని ఇస్కాన్ వారు అప్పగించారు. ఈ షార్ట్ ఫిలింకి ‘డివైన్ మెసెజ్ 1’ అని పేరు పెట్టారు. దీనికి ఇస్కాన్ ప్రతినిధి ‘సచినందన్ హరిదాస్’ కథ అందించగా సీతారాం ప్రభు గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలోనే ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ కూడా పూర్తిచేశారు.
Also Read : Mrunal – Rashmika : ఇటు మృణాల్ నో డబ్బింగ్.. అటు రష్మిక అన్ని భాషల్లో డబ్బింగ్..
ప్రస్తుతం ఈ ‘డివైన్ మెసెజ్ 1’ షార్ట్ ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ షార్ట్ ఫిలింని అమెజాన్ ప్రైమ్ తో సహా పలు ఓటిటి ప్లాట్ఫారమ్స్ లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. భగవద్గీతని ఈ జనరేషన్ వాళ్ళకి తెలియడానికి చేస్తున్న వీరి ప్రయత్నం అభినందనీయం. ‘డివైన్ మెసెజ్ 1’ తర్వాత వీటికి పార్ట్ 2, 3.. ఇలా ఉండొచ్చు అని సమాచారం.