బాలీవుడ్ సెలబ్రిటీలపై ఐటీ దాడులు.. తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌, వికాస్ బహల్ ఇంట్లో సోదాలు

బాలీవుడ్ సెలబ్రిటీలపై ఐటీ దాడులు.. తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌, వికాస్ బహల్ ఇంట్లో సోదాలు

Updated On : March 3, 2021 / 2:49 PM IST

IT attacks on Bollywood celebrities : బాలీవుడ్‌లో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ముంబై, పుణెలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హీరోయిన్‌ తాప్సీ, డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌, ప్రొడ్యూసర్‌ మధు మంతెన, వికాస్‌ బహల్‌ సహా పలువురి ఇళ్లు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ముంబై, పుణెలోని 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

అలాగే రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎక్సైడ్, క్వాన్ కంపెనీల సీఈవోల ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఫాంటమ్ ఫిల్మ్ సంస్థ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో… ఆ బ్యానర్‌ నిర్మించిన చిత్రాలతో సంబంధమున్న సినీ ప్రముఖల్ని ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

తాప్సీ, అనురాగ్‌కశ్యప్‌… సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు అనుకూలంగా గతంలో ట్వీట్లు చేశారు. ఇప్పుడు వీరిద్దర్ని ఐటీ అధికారులు టార్గెట్‌ చేయడం కలకలం రేపుతోంది.