మహర్షి సెన్సార్ కంప్లీట్

మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 04:33 AM IST
మహర్షి సెన్సార్ కంప్లీట్

Updated On : May 4, 2019 / 4:33 AM IST

మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి రిలీజ్‌‌కి రెడీ అవుతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మహర్షిలో కొత్త మహేష్‌ని చూసామని, డిఫరెంట్ షేడ్స్ ఉన్న అతని క్యారెక్టర్, కథ, మెసేజ్ అన్ని బాగున్నాయని, కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చని సెన్సార్ సభ్యులు చెప్పారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్‌గా నటించారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో మహర్షి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ మహర్షి ట్రైలర్..