Jabadasth Faima : బిగ్‌బాస్ వెళ్లొచ్చినందుకు ఫైమాకి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

గత వారం బిగ్‌బాస్ నుండి జబర్దస్త్ నటి ఫైమా ఎలిమినేట్ అయింది. జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలలో తన కామెడీతో మెప్పించిన ఫైమా బిగ్‌బాస్ లో దాదాపు 13 వారల పాటు కొనసాగింది.............

Jabadasth Faima : బిగ్‌బాస్ వెళ్లొచ్చినందుకు ఫైమాకి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

Jabadasth praveen gifted gold chain to faima

Updated On : December 10, 2022 / 7:08 AM IST

Jabadasth Faima :  ఈ సీజన్ బిగ్‌బాస్ కి 21 మంది వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. గత వారం బిగ్‌బాస్ నుండి జబర్దస్త్ నటి ఫైమా ఎలిమినేట్ అయింది. జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలలో తన కామెడీతో మెప్పించిన ఫైమా బిగ్‌బాస్ లో దాదాపు 13 వారల పాటు కొనసాగింది. డబ్బుల కోసం, తన ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం కోసమే బిగ్‌బాస్ కి వెళ్లానని హౌజ్ లో ఉన్నప్పుడు చెప్పింది.

ఇక ఫైమా బయటకి వచ్చాక తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జబర్దస్త్ నటులు ఆమెకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు, సెలబ్రేషన్స్ చేశారు. దీనిని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది ఫైమా. ముందుగా అందరు తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం జబర్దస్త్ నటుడు ప్రవీణ్ తో కలిసి కేక్ కట్ చేసింది ఫైమా. కడప దర్గాకి వెళ్లి అక్కడ పూజలు చేయించి అక్కడి వాటర్ ని తీసుకొచ్చి ఫైమాకి ఇచ్చాడు ప్రవీణ్. తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే తన మెడలోని బంగారపు గొలుసు తీసి ఫైమా మెడలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ప్రవీణ్.

BiggBoss 6 Day 92 : బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా??

గత కొన్నేళ్లుగా వీరిద్దరూ పటాస్, జబర్దస్త్.. పలు షోలలో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా గాసిప్ నడుస్తుంది. కానీ దీని గురించి ప్రవీణ్, ఫైమా ఎవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు.