Jabardasth Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
జబర్దస్త్ యాంకర్ గానే కాక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది.

anchor anasuya father passed away
Jabardasth Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ గానే కాక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసం ఉండే సుదర్శనరావు ఈ రోజు ఉదయం అస్వస్ధతకు లోనయ్యారు. అనంతరం కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గోన్నారు. ప్రస్తుతం అనసూయ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.