Jabardasth Varsha : బిగ్‌బాస్ 7లోకి జబర్దస్త్ వర్ష ఎంట్రీ.. ఇండైరెక్ట్ గా చెప్పేసిందిగా..

అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ వర్ష వచ్చి చేరింది.

Jabardasth Varsha : బిగ్‌బాస్ 7లోకి జబర్దస్త్ వర్ష ఎంట్రీ.. ఇండైరెక్ట్ గా చెప్పేసిందిగా..

Jabardasth Varsha will be part in BiggBoss Telugu Season 7 Rumors goes Viral

Jabardasth Varsha :  తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్(BiggBoss) సీజన్ 7 త్వరలో వస్తుంది. ఇటీవలే నాగార్జున(Nagarjuna)తో చేసిన ఓ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

ఈ సారి ఏదో కొత్త థీమ్ తో బిగ్‌బాస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ వర్ష వచ్చి చేరింది. సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ, స్కిట్ లతో ప్రేక్షకులని మెప్పించి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్, పలు టీవీ షోలు, ఓ సీరియల్ తో బుల్లితెరపై బిజీగానే ఉంది వర్ష.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేసినా చెల్లి, అక్క.. ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తాను. త్వరలో ఓ పెద్ద షోలో కనిపించబోతున్నాను. ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నా వివరాలన్నీ ఆ షోలోనే చెప్తాను అని తెలిపింది. దీంతో త్వరలో మొదలయ్య్ పెద్ద షో బిగ్‌బాస్ అని, అందులో వర్ష పాల్గొనబోతుందని టాక్ నడుస్తుంది. సాధారణంగానే జబర్దస్త్ నుంచి ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు బిగ్‌బాస్ కి వెళ్తారు. దీంతో ఈ సారి వర్ష కి ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

Roshan Family : త్వరలో హృతిక్ రోషన్ ఫ్యామిలీ బయోపిక్.. తాత నుంచి మనవడి వరకు రోషన్ ఫ్యామిలీ..

మరి వర్ష నిజంగానే బిగ్‌బాస్ లో కనిపిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సెట్ వర్క్ పూర్తవుతుంది. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని సమాచారం.