అభిమానులతో జీ తెలుగు సీరియల్స్​ నటీనటులు సందడి.. వారి హంగామా చూస్తారా?

ఆయా సీరియళ్ల నటీనటులు తమ అభిమానులతో సరదాగా సంభాషించారు. వారికి బహుమతులను..

అభిమానులతో జీ తెలుగు సీరియల్స్​ నటీనటులు సందడి.. వారి హంగామా చూస్తారా?

ZEE

జీ తెలుగు సీరియల్స్​ జగద్ధాత్రి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య నటీనటులు, ప్రేక్షకుల ఆత్మీయ సమ్మేళనం తాజాగా మంచిర్యాలలో జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం జగద్ధాత్రి ఇంట మిత్ర, లక్ష్మీల కలయిక పేరుతో మార్చి 31న రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

జగద్ధాత్రి(దీప్తి మన్నె)‌‌, కేదార్(దర్శ్​ చంద్రప్ప), మిత్రనందన్​ (రాఘవేంద్ర), లక్ష్మీ(మహీ గౌతమి) జంటలు ఈ ప్రోగ్రాంలో టవల్​ లాకింగ్​ గేమ్ తో పాటు సరదా ఛాలెంజ్​లు, ఉట్టి కొట్టడం, అంత్యాక్షరి ఆడారు. అలాగే, హోలీ వేడుక సరదాగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఆయా సీరియళ్ల నటీనటులు తమ అభిమానులతో సరదాగా సంభాషించారు. వారికి బహుమతులను కూడా అందించారు. డ్రామా జూనియర్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గానం ప్రేక్షకులను అలరించింది. మా అన్నయ్య సీరియల్​ నటుడు గోకుల్​ మీనన్​కి ఓ వికలాంగురాలు రాఖీ కట్టారు. జీ తెలుగు నటీనటులతో అభిమానులు సెల్ఫీలు దిగారు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.. ఆ పండక్కి..