Jai Bheem : ‘జై భీమ్’కు అరుదైన గౌరవం.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్
ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులకు ఎంపికైంది. తాజాగా ఈ సినిమాకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డ్ తర్వాత అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే....

Jai Bheem
Jai Bheem : తమిళ్ స్టార్ హీరో సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క నటనకు కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఇటీవల దీపావళికి ‘జై భీమ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఓటిటిలో విడుదలయిన ఈ సినిమాకి భారీ స్పందన వచ్చింది. ఓ గిరిజన యువకుడి లాకప్ డెత్, ఆ కేసుని డీల్ చేసిన లాయర్ జీవితం ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అన్ని భాషల ప్రజలకి ఈ సినిమా బాగా నచ్చింది. విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు ఈ చిత్రంపై.
Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో
ఇక ఐఎమ్‌డీబీ సినిమాల జాబితాలో ‘జై భీమ్’ ప్రపంచ సినిమాలని దాటుకొని ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులకు ఎంపికైంది. తాజాగా ఈ సినిమాకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డ్ తర్వాత అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెగన్ గ్లోబ్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది ‘జై భీమ్’. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్ వేదికగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరగనుంది.