Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమాని అత్యుత్సాహం.. బిడ్డని తీసుకోవాలంటూ..
తన బిడ్డని చేతుల్లోకి తీసుకోవాలంటూ ఒక అభిమాని పవన్ కి అందజేయగా.. తాను మాత్రం నిరాకరించి బిడ్డని వెనక్కి ఇచ్చేశాడు.

Janasena Pawan Kalyan refuse to take his fans baby on his hands
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడో విడత వారాహి యాత్రలో ఉన్నాడు. ఈక్రమంలో విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఇక ఈ యాత్రలో పలువురు అభిమానులు పవన్ చేతులకు తమ చంటి పిల్లలను ఇచ్చి ఆనందపడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పవన్ చేతుల్లోకి తన బిడ్డని తీసుకోవాలని ఒక అభిమాని కోరగా.. పవన్ మాత్రం నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Renu Desai : రేణూ దేశాయ్ పై ఇంకా తగ్గని ట్రోలింగ్.. పవన్ కళ్యాణ్ నిన్ను అందుకే తన్ని తరిమేశాడు..
అయితే అసలు అక్కడ ఏమైంది. ఇటీవల ఒక ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు అభివాదం చేస్తూ బయటకు వస్తున్నాడు. ఆ క్రమంలో ఒక అభిమాని ఎదురుగా వచ్చి తన చంటిబిడ్డని పవన్ కి ఇచ్చేందుకు ప్రత్నించాడు. కానీ పవన్ పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటే, ఆ అభిమాని పవన్ చెయ్యి పట్టుకొని లాగి బిడ్డని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ గందరగోళంలో పవన్ చేతుల్లోకి ఆ బిడ్డను తీసుకున్నప్పటికీ పట్టు కుదరక వెంటనే ఆ బిడ్డని వెనక్కి ఇచ్చేశాడు.
Chandramukhi 2 : డబ్బింగ్ చెబుతున్న టైంలో చంద్రముఖి ఎంట్రీ.. భయపడ్డ వడివేలు.. వీడియో వైరల్
ఈ మొత్తం విషయంలో ఆ బాబు భయపడిపోయి, చేతుల్లో నలిగిపోయి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇక ఈ వీడియోని నెట్టింట షేర్ చేస్తూ కొంతమంది పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు. అయితే అది చూసిన కొంతమంది నెటిజెన్స్ మాత్రం.. ముందు ఆ తండ్రికి బుద్ధిలేదు. చంటి పిల్లాడి విషయంలో జాగ్రత్త వహించకుండా ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ తప్పు ఎవరిది అయినప్పటికీ గాయపడేది చంటి పిల్లాడు. కాబట్టి అభిమానులు తమ హీరోపై అభిమానం చూపించే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది.
Lesson: How Not to Behave as a Parent
— Bhavya? (@unexpected5678) August 15, 2023