Janhvi Kapoor : అతడితో జాన్వీ ప్రేమాయణం నిజమేనా.. తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న ఇద్దరు..

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోమవారం తెల్లవారుజామున తన చెల్లి ఖుషీ మరియు శిఖర్ పహారియా (Shikhar Pahariya) తో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా డేటింగ్ లో ఉన్నారని, తరువాత బ్రేకప్ అయ్యిందని గతంలో గట్టిగా వార్తలు వినిపించాయి. తాజాగా..

Janhvi Kapoor : అతడితో జాన్వీ ప్రేమాయణం నిజమేనా.. తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న ఇద్దరు..

Janhvi Kapoor visit Tirupati along with her Rumoured Boyfriend Shikhar Pahariya - Pic Source Google

Updated On : April 3, 2023 / 4:02 PM IST

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన చెల్లి ఖుషీ కపూర్‌ మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా (Shikhar Pahariya) తో కలిసి తిరుపతిలో సందడి చేసింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. గతంలో జాన్వీ కపూర్ అండ్ శిఖర్ పహారియా డేటింగ్ లో ఉన్నారని, తరువాత బ్రేకప్ అయ్యిందని బి-టౌన్ లో గట్టిగా వార్తలు వినిపించాయి.

NTR30: చీకట్లో విలన్లను చెడుగుడు ఆడేస్తున్న తారక్..!

తాజాగా ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. సోమవారం తెల్లవారుజామున చెల్లి ఖుషీ, శిఖర్ తో కలిసి వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించింది జాన్వీ. దీంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం జాన్వీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు బాలీవుడ్ చిత్రాలు, ఒకటి తెలుగు సినిమా.

NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కొరటాల..?

NTR30 సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీతో తన తల్లి శ్రీదేవిలా సౌత్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. మరి జాన్వీ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. కాగా ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే జాన్వీ కూడా ఈ మూవీ షూట్ లో పాల్గొనుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ (NTR) చేస్తున్న సినిమా కావడంతో మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.