తిరుపతిలో శ్రీదేవి కూతురు పెళ్లి

తొలి మూవీ “ధడక్”తోనే మంచి విజయాన్ని అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీ అమ్మ శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా..అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ….పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మే ఎవరో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు కారణమని జాన్వీ చెప్పింది.
తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలేంటని జాన్వీని అడుగగా….అతని దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి. అతనికి తను చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఇక తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని చెప్పేసింది జాన్వీ. అంతేకాదు సంప్రదాయ కాంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో నా పెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం జాహ్నావీ.. గుంజన్ సక్సేనా’తో పాటు, రుహి అఫ్జా,’తఖ్త్, దోస్తానా 2 సినిమాలతో బిజీగా ఉంది. పంకజ్ త్రిపాఠితో కలిసి జాహ్నవీ నటించిన ‘గుంజన్ సక్సేనా’ 2020 మార్చిలో విడుదల కానుంది.