Jani Master : అల్లు అర్జున్ అరెస్ట్ పై మాట్లాడిన జానీ మాస్టర్.. ఆయన అరెస్ట్ అయితే నేను హ్యాపీగా ఉన్నట్టు మీమ్స్ వేశారు..
అల్లు అర్జున్ ఘటనపై కూడా స్పందించారు.

Jani Master Reacts on Allu Arjun Sandhya Theater Issue in Recent Interview
Jani Master – Allu Arjun : జానీ మాస్టర్ పై ఇటీవల ఓ లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కేసులో జైలుకెళ్లొచ్చారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు జానీ మాస్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Also See : SSMB29 Fan Made Posters : మహేష్ – రాజమౌళి సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూశారా?
జానీ మాస్టర్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అరెస్ట్ అయినప్పుడు తన భార్య ఇచ్చిన సపోర్ట్, జైలు జీవితం, తన ఫ్యామిలీ.. ఇలా అనేక సంగతులు మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్ ఘటనపై కూడా స్పందించారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నేను మీమ్స్, సోషల్ మీడియా చూసాను. ఆయన అరెస్ట్ అయితే నేను హ్యాపీగా ఉన్నట్టు మీమ్స్ వేశారు. కానీ బన్నీ అరెస్ట్ అయిన తర్వాత నాకు ముందు వాళ్ళ పిల్లలే గుర్తొచ్చారు. సెట్స్ కి వస్తారు వాళ్ళు ఆడుకుంటారు నా కళ్ళముందు చూసాను. నాకు వాళ్ళే గుర్తొచ్చారు. ఆ రోజు జరిగింది ఒక దురదృష్ట ఘటన. నేను కూడా హాస్పిటల్ కి వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసి వచ్చాను అని తెలిపారు.
ఇటీవల సంధ్య థియేటర్ ఘటనలో ఎఫెక్ట్ అయిన ఆ కుటుంబాన్ని, బాలుడిని పరామర్శించారు జానీ మాస్టర్. ఆర్ధిక సహాయం కూడా చేస్తానని ప్రకటించారు. జైలుకెళ్ళొచ్చిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ తన డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెడుతూ, బయట ఈవెంట్స్ లో కనిపిస్తూ ఫ్యామిలీతో గడుపుతున్నారు.