Jani Master Wife : పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ భార్య.. ఆమెపై కూడా కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్..
తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.

Jani Master Wife went To Narsing Police Station for Jani Master Case
Jani Master Wife : జానీ మాస్టర్ ని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు ఆమె భార్యపై కూడా కేస్ పెట్టింది. జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఇటీవల జానీ మాస్టర్ కి వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది జానీ భార్య. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెని మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేసింది.
Also Read : Nagababu – Jani Master : నాగబాబు ట్వీట్.. జానీ మాస్టర్ ని ఉద్దేశించేనా..?
దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద కొరియోగ్రాఫర్ జానీ భార్య అయేషా మీడియాపై ఫైర్ అయింది. నాకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ మీడియాను బెదిరించింది జానీ మాస్టర్ భార్య అయేషా.