Ram Charan : రామ్‌చరణ్ కలవడానికి జపాన్ నుంచి వచ్చిన లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..!

రామ్‌చరణ్ కలవడానికి జపాన్ నుంచి లేడీ ఫ్యాన్స్ హైదరాబాద్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు..

Ram Charan : రామ్‌చరణ్ కలవడానికి జపాన్ నుంచి వచ్చిన లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..!

Japan Female fans come to hyderabad for meet Ram Charan

Updated On : October 16, 2023 / 8:58 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక జపాన్ లో అయితే ఎంతటి స్టార్‌డమ్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో అక్కడకి వెళ్లిన రామ్ చరణ్ కి జపాన్ అభిమానుల నుంచి ఓ రేంజ్ వెల్కమ్ వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పటిలో బాగా వైరల్ అయ్యాయి. అయితే వారి అభిమానం జపాన్ లోనే ఆగిపోలేదు. ఇండియా, హైదరాబాద్ వరకు వచ్చేసింది.

తాజాగా జపాన్ కి చెందిన కొందరు లేడీ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. వారందర్ని రామ్ చరణ్ తన ఇంటిలో కలుసుకున్నట్లు తెలుస్తుంది. వారి తెచ్చిన గిఫ్ట్స్ ని రామ్ చరణ్ కి అందించారు. ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి వారిని ఆనందపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పిక్స్ చూసిన అభిమానులు.. ‘నిజమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Mahesh babu : ఫస్ట్ టైం మా ఆవిడతో ఇలా రావడం.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి ఒక సాంగ్ నెట్టింట లీక్ అయ్యింది. ఇప్పుడు ఆ పాటనే దసరా కానుకగా అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మూవీ టీం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.