Jayakrishna Ghattamaneni : ఫస్ట్ సినిమా ఫ్లాప్.. మహేష్ అన్న కొడుక్కి హిట్ ఇవ్వడానికి రంగంలోకి దిగిన ‘బేబీ’ కాంబో..?
జయకృష్ణ ఘట్టమనేని ఇటీవల శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. (Jayakrishna Ghattamaneni)
Jayakrishna Ghattamaneni
Jayakrishna Ghattamaneni : మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ఇటీవల శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక రొటీన్ లవ్ స్టోరీగా ఆ సినిమా తెరకెక్కింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం, జయకృష్ణ మొదటి సినిమా కావడం, మహేష్ కూడా ఈ సినిమా గురించి పోస్టులు పెట్టడంతో సినిమాపై కాస్త బజ్ నెలకొంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
జులైలో ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు జయకృష్ణ నుంచి నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా జయకృష్ణ నెక్స్ట్ సినిమాపై టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తుంది. బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమాలు అందించిన కాంబో నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జయకృష్ణ తో సినిమా చేయబోతున్నారని వినిపిస్తుంది.
Also Read : Swathi Karimireddy : తిమ్మరాజుపల్లి టీవీ నటి.. స్వాతి పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తారా? లేక సాయి రాజేష్ కేవలం కథ ఇచ్చి చెన్నై లవ్ స్టోరీలా మరొకరితో డైరెక్ట్ చేయిస్తాడా తెలియాలి. సాయి రాజేష్ – SKN క్రేజీ కాంబోలో జయకృష్ణతో లవ్ స్టోరీ అంటే కచ్చితంగా అంచనాలు ఉంటాయి. హీరోపైన అంచనాలు లేకపోయినా ఈ కాంబోపై, వీళ్ళు తీసే లవ్ స్టోరీలపై కచ్చితంగా అంచనాలు ఉంటాయి. మరి సాయి రాజేష్, SKN కలిసి జయకృష్ణతో సినిమా తీసి ఘట్టమనేని ఫ్యామిలీకి హిట్ ఇస్తారా చూడాలి.
