JD Chakravarthy : దర్శకులకి వాళ్ళ కథలపై నమ్మకం లేనప్పుడే బూతులు, అడల్ట్ కంటెంట్ పెడతారు.. JD చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల వెబ్ సిరీస్ లలో, సినిమాలలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది. బూతులు, శృగార సన్నివేశాలు అవసరం లేకపోయినా పెడుతున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిగురించి జేడీ చక్రవర్తి ని అడగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

JD Chakravarthy : దర్శకులకి వాళ్ళ కథలపై నమ్మకం లేనప్పుడే బూతులు, అడల్ట్ కంటెంట్ పెడతారు.. JD చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..

JD Chakravarthy comments on Directors regarding Bold Content in Movies and Series

JD Chakravarthy :  శివ(Shiva) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన JD చక్రవర్తి ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాలు చేశాడు. డైరెక్టర్ గా కూడా పలు సినిమాలను తెరకెక్కించాడు JD చక్రవర్తి. గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు JD. చివరిసారిగా 2019లో హిప్పీ అనే సినిమాలో కనిపించాడు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగులో కనిపించలేదు.

చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘దయ'(Daya) అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు JD. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా(Eesha Rebba), నంబీషన్ రమ్య, విష్ణుప్రియ(Vishnupriya), కమల్ కామరాజ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా జేడీ చక్రవర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్ గురించి, తన సినిమాల గ్యాప్ గురించి మాట్లాడాడు. అలాగే ఇటీవల వెబ్ సిరీస్ లలో, సినిమాలలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది. బూతులు, శృగార సన్నివేశాలు అవసరం లేకపోయినా పెడుతున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిగురించి జేడీ చక్రవర్తి ని అడగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Prabhas : దీపికా పదుకొనే గురించి ప్రభాస్ ఇంటెర్నేషనల్ మీడియాతో ఏం చెప్పాడో తెలుసా?

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. హీరోయిన్స్ చిన్న బట్టలు వేస్తేనో, బోల్డ్, అడల్ట్ కంటెంట్ పెడితేనే సినిమాలు ఆడతాయి అంటే నేను నమ్మను. దర్శకులకి వాళ్ళ కథలపై నమ్మకం లేనప్పుడే అలాంటి సన్నివేశాన్ని, మాటల్ని జోడిస్తారు. బాహుబలి, పుష్ప, RRR సినిమాల్లో అలాంటి సీన్స్ లేవు, కానీ భారీ విజయం సాధించాయి. ఇక వెబ్ సిరీస్ లు వేరు. అక్కడ రియాలిటీకి చూపించడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి కొంతమంది పెడుతున్నారు. కానీ సిరీస్ లో అయినా అనవసరంగా, కథకు అక్కర్లేకపోయినా పెడితే మాత్రం తప్పే. అలాంటి సిరీస్ లు కూడా కొన్ని వస్తున్నాయి. దర్శకుడు అనుకుంటే సినిమాకు కూడా సెన్సార్ అవసరం లేదు. దర్శకుడి బుర్రకి సెన్సార్ ఉంటే చాలు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లలో అసభ్యకరమైన సన్నివేశాలు లేవు అని అన్నారు. దీంతో జేడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.