Josh Awards : ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024 వేడుక.. ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే..
జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ పేరిట హైదరాబాద్ హరిహర కళాభవన్ లో ఘనంగా ఈవెంట్ ని నిర్వహించారు.

Josh South India Nandi Awards Event Happened in Hyderabad
Josh Awards : జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ పేరిట హైదరాబాద్ హరిహర కళాభవన్ లో ఘనంగా ఈవెంట్ ని నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన పలువురికి ఆయా కేటగిటిలలో బెస్ట్ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో బింబిసార మూవీకి బెస్ట్ డైరెక్టర్ గా వశిష్టకు, RRR లోని నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు, నటుడు మాణిక్ కి, కమెడియన్ గా రచ్చ రవికి, బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా డీజే టిల్లులో మురళీధర్ గౌడ్ కి, మా ఊరి సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా నేహా రెడ్డికి, పుష్పలో బెస్ట్ విలన్ గా అజయ్ ఘోష్ కి, వీరితో పాటు మరిన్ని కేటగిరీలలో పలువురికి జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ అందించారు. అవార్డులు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
Also Read : +3+Aditi Rao Hydari – Siddharth : ఒరే బాబు.. మేము సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోలేదు.. పెళ్లి ఎప్పుడంటే..
ఇక ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ మాట్లాడుతూ… టాలీవుడ్ లో ఇప్పటికే రెండు సార్లు జోష్ టాలెంట్ అవార్డ్స్ ఇచ్చాము. ఇప్పుడు మూడో సారి ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులకు ధన్యవాదాలు. అవార్డ్ గ్రహీతలకు శుభాకాంక్షలు. ఇకపై కూడా ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ ను తమ సంస్థ నుంచి అందిస్తాం అని తెలిపారు.