No Permission Vakilsab : వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ

యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో ఏప్రిల్‌ 3వ తేదీన నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు.

No Permission Vakilsab : వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ

Vakilsab

Updated On : March 31, 2021 / 12:54 PM IST

no permission for ‘Vakilsab’ pre-release event : వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి లభించలేదు. యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో ఏప్రిల్‌ 3వ తేదీన నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన వకీల్‌సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని తలపెట్టింది.

ఇందుకోసం జూబ్లీహిల్స్‌ పోలీసులకు అనుమతి మంజూరు కోరుతూ లేఖ రాశారు. అయితే కోవిడ్‌–19 పంజా విసురుతున్న నేపథ్యంలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ఇటీవలనే జీవో జారీ చేశారు.

ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్‌ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొనడం జరిగిందని, తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని స్పష్టం చేశారు.