K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కలెక్షన్స్.. బాహుబలి రికార్డ్స్ బ్రేక్!

బాక్సాఫీసు వద్ద ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం సాధించిన మొత్తం కలెక్షన్లను ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ ఆరు రోజుల్లో దాటేసింది.

K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కలెక్షన్స్.. బాహుబలి రికార్డ్స్ బ్రేక్!

K.g.f Chapter 2

Updated On : April 20, 2022 / 8:37 PM IST

K.G.F: Chapter 2: బాక్సాఫీసు వద్ద ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం సాధించిన మొత్తం కలెక్షన్లను ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఆరు రోజుల్లో దాటేసింది. మంగళవారం నాటికి, ఆరు రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.676 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. మంగళవారం ఒక్కరోజే అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

KGF2: ఓవర్సీస్‌లోనూ అదే జోరు.. ఏకంగా 3 మిలియన్‌లతో దుమ్ములేపేశారు!

విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇతర భాషలతో పోలిస్తే హిందీలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. బుధవారం నాటికి ఈ చిత్ర హిందీ వెర్షన్ రూ.250 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్: చాప్టర్-2’ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఇంకా కొంతకాలం మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేలోపు ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ వారం బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ చిత్రం విడుదలవుతుండటంతో, ఈ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.