Kaikala Satyanarayana : పూజాహెగ్డేకి తాతగా.. కైకాల చివరి సినిమా..
2013లో చివరగా జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాల్లో కాసేపు కనిపించరు కైకాల. అప్పట్నుంచి సినిమాలకి దూరంగానే ఉంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో రెండు సినిమాల్లో నటించారు...............

Kaikala Satyanarayana last movie
Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రలు చేశారు కైకాల.
Kaikala Satyanarayana : యముడంటే కైకాల సత్యనారాయణే..
2013లో చివరగా జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాల్లో కాసేపు కనిపించరు కైకాల. అప్పట్నుంచి సినిమాలకి దూరంగానే ఉంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో రెండు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా కాసేపు మెరిపించారు కైకాల. చివరగా 2019లో మహర్షి సినిమాలో పూజాహెగ్డేకి తాతగా నటించారు. ఆ సినిమాలో కొన్ని నిముషాలు మహేష్ బాబుతో మాట్లాడుతూ కనిపిస్తారు. దీంతో మహేష్ బాబు మహర్షి సినిమా కైకాలకి చివరి సినిమాగా మారింది.