Bhagavanth Kesari : అనిల్ రావిపూడి మార్క్‌తో భగవంత్ కేసరి ప్రమోషన్స్.. కాజల్ అండ్ శ్రీలీల డాన్స్ రీల్ అదుర్స్!

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో ప్రమోట్ చేస్తున్నాడు. బాలయ్య పాటకి కాజల్ అండ్ శ్రీలీల.. డాన్స్ రీల్ చేసి అదుర్స్ అనిపించారు.

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి మార్క్‌తో భగవంత్ కేసరి ప్రమోషన్స్.. కాజల్ అండ్ శ్రీలీల డాన్స్ రీల్ అదుర్స్!

Kajal Aggarwal Sreeleela dance reel at Balakrishna Bhagavanth Kesari sets

Updated On : June 19, 2023 / 7:34 PM IST

Balakrishna – Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) బాలయ్యకు జోడిగా నటిస్తుంటే శ్రీలీల(Sreeleela) ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్ గ్యాప్ సమయంలో.. సెట్ లో ఫైట్ అండ్ డాన్స్ మాస్టర్స్ తో కలిసి అనిల్ రావిపూడి బాలయ్య సినిమాలోని ఒక సాంగ్ కి రీల్ చేసి పోస్ట్ చేశాడు.

Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..

ఆ పోస్ట్ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ వీడియోని కామెడీ స్క్రిప్ట్ గా చేసి తన మార్క్‌తో దర్శకుడు భగవంత్ కేసరి ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. అనిల్ రావిపూడినే డాన్స్ వేసేది.. మేము కూడా డాన్స్ వేస్తామంటూ కాజల్ అండ్ శ్రీలీల.. బాలయ్య పాటకి చిందులేసి అదరగొట్టేశారు. బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని ‘చిలక పచ్చ కొక’ సాంగ్ కి ఇద్దరు చిలకలు మాస్ స్టెప్పులు వేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. బాలయ్యని సరికొత్తగా దర్శకుడు చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాల మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా హిట్ అందుకొని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.