Kalyan Ram : హాస్పిటల్‌లో తారకరత్న.. పాటని పోస్ట్‌పోన్ చేసుకున్న కళ్యాణ్ రామ్!

నిన్న నారా లోకేష్ మొదలుపెట్టిన 'యువగళం' పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా పాట రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేసుకున్నాడు.

Kalyan Ram : హాస్పిటల్‌లో తారకరత్న.. పాటని పోస్ట్‌పోన్ చేసుకున్న కళ్యాణ్ రామ్!

kalyan ram tarak ratna

Updated On : January 28, 2023 / 2:18 PM IST

Kalyan Ram : సినీ నటుడు నందమూరి తారకరత్న నిన్న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం చేరుకున్నాడు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ మరియు టీడీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ముందుకు నడిచాడు. అయితే కొంత సమయానికి నడుస్తూ నడుస్తూ తారకరత్న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని వెంటనే అక్కడి నుంచి కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు కార్యకర్తలు. అయితే అప్పటికే పల్స్ పడిపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే..?

కానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం గానే ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని హాస్పిటల్ కి నిన్న సాయంత్రం తరలించారు కుటుంబ సభ్యులు. తారకరత్న ఆరోగ్యం గురించి అందరూ బాధపడుతున్న సమయంలో తన సినిమా ప్రమోషన్స్ చేయడం సరి కాదు అనుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్దమవుతుండడంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల ఒక పాటని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రెండో పాటకి ముహూర్తం ఫిక్స్ చేశారు.

బలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఈ సాంగ్ ప్రోమోని నిన్న రిలీజ్ చేస్తూ.. ఫుల్ సాంగ్ ని ఈ ఆదివారం సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆ పాట రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ‘తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాము. సోమవారం నాడు ఈ పాటని విడుదల చేస్తాము. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలంటూ అమిగోస్ చిత్ర యూనిట్ నుంచి ప్రార్ధిస్తున్నాము’ అంటూ అంటూ ట్వీట్ చేశారు. కాగా బాలకృష్ణ నిన్నటి నుంచి హాస్పిటల్ లోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు డాక్టర్లు, బాలకృష్ణతో మాట్లాడుతూ హెల్త్ అప్ డేట్ ను తెలుసుకుంటున్నాడు.