Kamakshi Bhaskarla : వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు.. టాలీవుడ్ పై వ్యాఖ్యలు చేసిన నటి..
పొలిమేర 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కామాక్షి భాస్కర్ల సినిమాల గురించి పలు విషయాలను పంచుకుంది.

Kamakshi Bhaskarla Interesting Comments on Tollywood
Kamakshi Bhaskarla : నటి కామాక్షి భాస్కర్ల పలు సినిమాలు, సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడిప్పుడే మెయిన్ లీడ్స్ చేస్తుంది. త్వరలో పొలిమేర 2(Polimera 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మెయిన్ లీడ్ చేసింది కామాక్షి. ఈమె నటి మాత్రమే కాదు డాక్టర్, రైటర్, మోడల్, పర్వతారోహకురాలు కూడా. పొలిమేర 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కామాక్షి భాస్కర్ల సినిమాల గురించి పలు విషయాలను పంచుకుంది.
Also Read : Rithu Chowdary : అతనివల్ల మోసపోయాను.. డబ్బులు నష్టపోయాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ..ఓ నటిగా అన్ని క్రాఫ్ట్స్ లో ఉన్న కష్టాన్ని తెలుసుకోవడం ఇష్టపడతాను. దాని వల్ల సినిమాపై ఇంకా గౌరవం పెరుగుతుంది. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. అయితే ఇక్కడ ఒక క్రాఫ్ట్ లో పనిచేసేవాళ్ళు వేరే క్రాఫ్ట్ లో ఉన్న వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు. ఇది మారాలి. నాకు ఈ పొగరు రాకూడదనే నేను అన్ని క్రాఫ్ట్స్ లోను పనిచేస్తున్నాను. ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాసాను. భవిష్యత్తులో అన్ని కుదిరితే దర్శకత్వం కూడా చేస్తాను అని తెలిపింది. దీంతో కామాక్షి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.